గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మరో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 568కి చేరింది. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాల్లో గుంటూరు రెండోస్థానంలో ఉంది. ఇన్నాళ్లూ పట్టణ ప్రాంతాలను కుదిపేసిన కోవిడ్ వైరస్.. ఇప్పుడు పల్లెప్రాంతాలకు విస్తరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం గుంటూరులో 215, నర్సరావుపేటలో 200, తాడేపల్లిలో 22 కేసులున్నాయి. ఇవాళ వెల్లడించిన 2 కేసులు గుంటూరు సీతానగరం, దుగ్గిరాలలో నమోదయ్యాయి. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపుతో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం యంత్రాంగానికి సవాల్‌గా మారింది.