ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కొత్తగా 3 కరోనా కేసులు - గుంటుూరులో కరోనా కేసులు తాజా వార్తలు

గుంటూరు జిల్లాలో కొత్తగా.. కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నేడు కొత్తగా 3 కేసులు వెలుగుచూడగా.. మొత్తం కేసుల సంఖ్య 445కు చేరింది.

corona cases in guntur district
గుంటూరు జిల్లాలో కొత్తగా 3 కరోనా కేసులు

By

Published : May 26, 2020, 2:31 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా మరో 3 కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి జిల్లాలో కేసుల సంఖ్య 445కు చేరుకుంది. మాచర్లలో 1, తాడేపల్లిలో 1, నంబూరులో 1 చొప్పున తాజా బాధితులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

జిల్లాలోనే అత్యధికంగా నరసరావుపేటలో 190.. ఆ తర్వాత గుంటూరు నగరంలో 182 మంది బాధితులు ఉన్నారన్నారు. మాచర్ల, తాడేపల్లిలో ఇప్పటికే కేసులు ఉండగా... కొత్తగా నంబూరులోని వీవీఐటీ కాలేజీ క్వారంటైన్ కేంద్రంలో ఒకరికి కరోనా సోకింది. పోలీసులు అతని కాంటాక్ట్స్​ను గుర్తించే పనిలో పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details