ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్యూషన్ టీచర్ నిర్వాకం.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కరోనా - గుంటూరు జిల్లా కరోనా వార్తలు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరులో కరోనా విజృంభించింది. గురువారం ఒక్కరోజే 39 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక ఉపాధ్యాయుడు ద్వారా వీరందరికీ వైరస్ సోకింది.

corona-cases
corona-cases

By

Published : Oct 2, 2020, 11:13 AM IST

Updated : Oct 2, 2020, 11:55 AM IST

గుంటూరు జిల్లాలో ట్యూషన్ టీచర్ నిర్లక్ష్యం... విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కరోనా బారిన పడేలా చేసింది. భట్లూరులో ఒక ప్రైవేట్ ట్యూషన్ సెంటర్ స్టడీ అవర్స్ నిర్వహించాడు. ఆ ట్యూషన్ సెంటర్ నిర్వహించే ఉపాధ్యాయుడికి కరోనా లక్షణాలు కనిపించటంతో.. పరీక్ష చేయిస్తే కొవిడ్ నిర్ధరణ అయ్యింది. ఆయన ద్వారా 14మంది విద్యార్థులకు మహమ్మారి సోకింది. ఆ పిల్లలందరూ ఏడేనిమిదేళ్ల లోపు చిన్నారులే కావడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు కొవిడ్ వ్యాప్తి చెందింది.

ట్యూషన్ టీచర్ నిర్వాకం.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కరోనా

బాధితులను అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. భట్లూరు ఎస్సీ కాలనీని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. అధికారులు మైక్ ద్వారా ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే గ్రామంలోనే ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి ప్రజల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు.

వైరస్ వ్యాప్తికి కారకుడైన ఉపాధ్యాయునికి విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. విద్యాసంస్థలు ఆన్​లైన్ తరగతులు తప్ప నేరుగా క్లాసులు నిర్వహించకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నా ట్యూషన్ సెంటర్ వాటిని ఉల్లంఘించింది.

ఇవీ చదవండి..

వివేకా హత్య కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారికి కరోనా

Last Updated : Oct 2, 2020, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details