గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో కొత్తగా 87 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 72 వేల 969కి చేరింది. గత 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు నుంచి 32 కేసులు నమోదయ్యాయి. తెనాలి, బాపట్లలో 6 కేసుల చొప్పున, నాదెండ్లలో 4 పాజిటివ్ కేసులుగా గుర్తించారు. జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు. కొవిడ్‌తో ఇప్పటివరకు 650 మంది మృతి చెందారు. కరోనాతో అత్యధికంగా మృతి చెందినవారి సంఖ్యలో.. జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో ఉంది. 71 వేల 177 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
గుంటూరులో తగ్గుతున్న కరోనా కేసులు - today corona cases in guntur district latest news update
గుంటూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 87 కరోనా కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 72 వేల 969 మంది కొవిడ్ బారిన పడగా.. 71 వేల 177 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
జిల్లాలో తగ్గుతున్న కరోనా కేసులు