ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాచర్లలో సెంచరీ దాటిన కరోనా కేసులు - Corona cases crossing century in Macharla

గుంటూరు జిల్లా మాచర్లలో కరోనా మహమ్మారి.. చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే 98 వరకు కేసులు ఉండగా బుధవారం ఒక్కరోజే మరో 35 మందికి వైరస్ సోకింది.

Corona cases crossing century in Macharla
మాచర్లలో సెంచరీ దాటిన కరోనా కేసులు

By

Published : Jul 15, 2020, 9:34 PM IST

గుంటూరు జిల్లా మాచర్లలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే 98 వరకు కేసులు ఉండగా బుధవారం ఒక్కరోజే 35 మందికి వైరస్ సోకినట్టు అధికారులు చెప్పారు. రోజు రోజుకూ పెరుగుతోన్న కరోనా కేసులతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.

వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గురువారం నుంచి గురజాల డివిజన్ మొత్తం మళ్ళీ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు గురజాల ఆర్డీవో పార్థసారధి తెలిపారు. నిత్యావసర సరకుల విక్రయాలు, ఇతర లావాదేవీలు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details