గుంటూరు జిల్లాలో కొత్తగా 868 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 21,038కి చేరుకుంది. కొత్తగా వచ్చిన కేసుల్లో నగరంలోనే 250 ఉన్నాయి. ఇందులో శ్రీనివాసరావుతోటలోనే ఎక్కువ కేసులు వచ్చాయి. నగరంలోని వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 8మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో అక్కడ మిగతా వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
గుంటూరు జిల్లాలో కొత్తగా 868 కరోనా కేసులు - గుంటూరు జిల్లాలో కరోనా కేసులు వార్తలు
గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 868 కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో కేసుల సంఖ్య 21, 038కి చేరుకున్నాయి. కొత్తగా వచ్చిన కేసుల్లో నగరంలోనే 250 ఉన్నాయి. ఇందులో శ్రీనివాసరావుతోటలోనే ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం.
చిలకలూరిపేటలో 59, కొల్లిపొర 48, తెనాలి 45, నర్సరావుపేట 33, మాచర్ల 33, వినుకొండ 32, బాపట్ల 31, రెంటచింతల 23, దాచేపల్లి 21, తుళ్లూరు 19, వట్టిచెరుకూరు 18, చేబ్రోలు 17, సత్తెనపల్లి 16, ముప్పాళ్ల 16, గురజాల 15, నాదెండ్ల 14, మాచవరం 14, పిడుగురాళ్ల 13, మంగళగిరి 11, పెదకూరపాడు 11 కేసులు నమోదైనట్లు అధికారులు వివరించారు. తాజాగా కరోనా కారణంగా 8మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 188కి చేరింది. కోవిడ్ నుంచి కోలుకుని 12,007 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. పాజిటివ్‌గా ఉన్న వారిలో 3500 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా వారు కోవిడ్ కేర్ కేంద్రాలు, హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇళ్లలో ఉండే వారి కోసం కోవిడ్ కిట్లు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లక్షణాలు లేని వారికి ఎలాంటి మందులు అవసరం లేదని... అయితే ఏమైనా జ్వరం, తలనొప్పి, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే సంబంధిత ఏఎన్ఎంను సంప్రదిస్తే మందులు అందజేస్తారని సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు.
ఇదీ చూడండి.కడప కేంద్ర కారాగారం నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి