గుంటూరు జిల్లాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టినా.. మళ్లీ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ఇవాళ గుంటూరు నగరంలోనే 23 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో వైరస్ బాధితుల సంఖ్య 529కు చేరింది.
ప్రాంతాల వారీగా చూస్తే శ్రీనివాసరావు తోటలో 5, ఎల్. బి. నగర్లో 5, సంజీవయ్య నగర్ 4, ఆర్టీసీ కాలనీ 3, సంగడిగుంట 2, ఏటి అగ్రహారం1, నగరం పాలెం1, పొత్తూరివారి తోట 1, కొత్తపేటలో 1 కేసు నమోదయ్యాయి.