గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొన్నిరోజులుగా 200 నుంచి 300 మధ్యలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. పట్టణాల్లో వ్యాప్తి జోరు తగ్గగా.. పల్లెల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. జిల్లాలో కొత్తగా 259 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 63వేల 6కు చేరుకున్నాయి.
తాజాగా వెలుగు చూసిన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 51 కేసులున్నాయి. వట్టిచెరుకూరులో 18 పాజిటివ్ కేసులు, పొన్నూరు, నరసరావుపేటలో 17 కేసులు చొప్పున, చిలకలూరిపేటలో 13 కేసులు, మంగళగిరిలో 12 కేసులు, తాడేపల్లిలో 10 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 57 వేల 303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇవాళ జిల్లాలో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 580కి చేరింది.