ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాన్ కోవిడ్ ఆస్పత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

కనిపించని వైరస్ కరోనాతో జాగ్రత్తగా ఉండాలి సరే... మరి మిగతా రోగాల సంగతేంటి. ఇతర జబ్బులతో బాధ పడుతున్న వారికి చికిత్స ఎలా అందుతుంది. ఆసుపత్రుల్లో వారికి వైద్య సేవలు అందించటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీలకు సర్కారు పచ్చజెండా ఊపినా.. అక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు. గతానికి భిన్నంగా... ఆసుపత్రుల్లో రాబోతున్న మార్పులు ఎలా ఉంటాయి. రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యసేవల్లో సరికొత్త మార్పులకు కోవిడ్-19 నాంది పలికిన వైనంపై ఈటీవి భారత్ ప్రత్యేక కథనం.

corona care hospitals in ap
corona care hospitals in ap

By

Published : May 8, 2020, 3:41 PM IST

కరోనా వైరస్ వ్యాప్తితో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులను మూసివేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందించారు. అయితే రెండో విడత లాక్ డౌన్ తర్వాత ఓపీ సేవలకు ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ ఆస్పత్రులను కోవిడ్, నాన్ కోవిడ్ గా మార్చి చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. ప్రైవేటు ఆస్పత్రులు ఎలాంటి చర్యలు చేపట్టాల్సి వచ్చింది.

అన్ని రకాల జబ్బుల వారు ఓచోట చేరితే... వారిలో ఎవరికైనా వైరస్ ఉంటే.. ఎక్కువమందికి వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రైవేటు ఆస్పత్రులు ఓపి చికిత్సకు సంబంధించి కొన్ని స్వీయ నిబంధనలు విధించుకున్నాయి. కరోనా రోగి ఎవరైనా తెలియకుండా వస్తే వారి ద్వారా వైద్యులు, సిబ్బందికి వైరస్ సోకే అవకాశం ఉంది. ఇది వందలాది మందికి వ్యాపించే ప్రమాదం ఉంది. ఒకసారి సామాజిక వ్యాప్తి మొదలైతే ..దాన్ని నివారించటం చాలా కష్టం. అందుకే ఎవరి పరిధిలో వారు జాగ్రత్తలు, రక్షణ చర్యలు తీసుకోవాలి.

నాన్ కోవిడ్ ఆస్పత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆసుపత్రులు పాటించాల్సిన నియమాలు

  • పేషెంట్ ఆస్పత్రి లోపలకు ప్రవేశించే సమయంలోనే శానిటైజర్ తో చేతులు కడుక్కోవాలి.
  • శానిటైజర్ బాటిల్ పై అందరి చేతులు పడకుండా కాలితో తొక్కితే లిక్విడ్ పడేలా ఏర్పాటు.
  • ప్రత్యేకంగా ట్రయేజ్ జోన్ ఏర్పాటు చేసి ఆస్పత్రి సిబ్బంది తగిన జాగ్రత్తలతో అక్కడకు వెళ్లి రోగి వివరాలు తెలుకుంటారు.
  • రోగి ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకుంటున్నారు. ఆ ప్రాంతం రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్.. ఎందులో ఉందో చెప్పాలి.
  • రెడ్ జోన్ల నుంచి వచ్చే వారైతే వారికి గతంలో ఏమైనా కరోనా వచ్చిందా... లేదా కరోనా రోగులను ఎవరినైనా కలిశారా తెలుసుకోవాలి
  • థర్మల్ స్క్రినింగ్ ద్వారా శరీర ఉష్ణోగ్రత చెక్ చేస్తారు.
  • జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయా అనే విషయం తెలుసుకుంటారు.
  • అలాంటి వారి వద్దకు వైద్యులే ప్రత్యేకంగా వచ్చి పరీక్షిస్తారు.
  • కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వారిని కోవిడ్ ఆసుపత్రికి తరలిస్తారు.
  • మామూలు జ్వరం, జలుబు వంటివి ఉన్నా... వారి కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.
  • రోగులు వేచి ఉండే ప్రాంతంలో భౌతికదూరం పాటించేలా ఏర్పాటు చేశారు.
  • రోగి లేచి వెళ్లిన వెంటనే కుర్చీని శానిటైజర్ తో శుభ్రం చేస్తారు.
  • గంటకోసారి ఆసుపత్రి ప్రాంగణంలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారి చేస్తున్నారు.
  • డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించటం. కరెన్సీ ద్వారా చెల్లింపులను తగ్గించటం.
  • సిబ్బంది అందరూ తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించటం .
  • ఆసుపత్రి ఫార్మసీకి ఎవరైనా బయటివారు జలుబు, జ్వరం మందుల కోసం వస్తే వారి వివరాలు నమోదు.
    నాన్ కోవిడ్ ఆస్పత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


    పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు...
  • వీలైనంత వరకు వ్యక్తిగత వాహనంలో ఆసుపత్రికి రావాలి.
  • బస్సులు, రైళ్లలో వచ్చినపుడు ఎక్కడా చేతులు పెట్టరాదు.
  • శానిటైజర్ తో చేతులు తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి
  • ఆస్పత్రికి వచ్చే ప్రతి పేషెంట్ విధిగా మాస్క్ ధరించాలి.
  • పేషంట్ ఒక్కరు మాత్రమే ఆసుపత్రికి రావాలి.
  • వయోవృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే ఒక్కరిని సహాయం కోసం తెచ్చుకోవాలి.
  • వైద్యులకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి.
  • కరోనా లక్షణాలు ఉంటే తప్పనిసరిగా చెప్పాలి.. అందులో భయపడాల్సిన పనిలేదు.
  • స్మార్ట్ ఫోన్ ఉన్న రోగులు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.

    వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
  • వైద్యులు జాగ్రత్తలు తీసుకుని రోగులను పరిక్షిస్తున్నారు.
  • వెయిటింగ్ రూం వద్ద రోగులు గుంపులు లేకుండా చూడటం
  • ఓపీ గది తలుపులు తెరిచే ఉంచటం
  • రోగితో మాట్లాడే సమయంలో భౌతిక దూరం పాటించటం
  • మాస్కులు, గ్లౌజులతో పాటు ఫెస్ షీల్డులు తప్పనిసరి
  • ఎక్స్ రే తీసేవారు, బీపి చూసేవారు పీపీఈ కిట్లు ధరించిటం తప్పనిసరి
  • ముఖ్యమైన డాక్యుమెంట్లు మాత్రమే పరిశీలిస్తారు
  • గాడ్జెట్ల వినియోగం తగ్గించటం. వాచీలతో పాటు ఆభరణాలు ధరించకుండా జాగ్రత్తలు.
    నాన్ కోవిడ్ ఆస్పత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


    రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం క్రింద సేవలందించేందుకు ఆస్పత్రులున్నాయి. దాదాపు రెండు నెలల నుంచి ఆస్పత్రుల్లో ఎలాంటి చికిత్సలు, ఆపరేషన్లు లేవు. ఇపుడు ఓపీలకు అనుమతించటంతో రోగుల రావటం మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రక్షణ చర్యలు తప్పనిసరి అయ్యాయి. ఆరోగ్యశ్రీలో నమోదైన 540 నెట్ వర్క్ ఆసుపత్రుల్లోనూ వీటిని అమలు చేయటం తప్పనిసరి కానుంది. ఇది ఆస్పత్రులకు అదనపు భారమే. అయితే ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్తితుల్లో ఇది అత్యవసరం. వాటిని ఖర్చుగా చూడాల్సిన పనిలేదని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల సంఘం చెబుతోంది.

ఇవీచదవండి:తెల్లారేసరికి 'కూలీ'న బతుకులు- నిద్దట్లోనే అనంతలోకాలకు

ABOUT THE AUTHOR

...view details