ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ప్రభావంతో ఆగిపోయిన చేపల ఎగుమతి - ఆగిపోయిన చేపల ఎగుమతి వార్తలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన మహమ్మారి తీర ప్రాంత వాసులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. చేపల వేట, ఎగుమతులకు ప్రధాన కేంద్రమైన నిజాంపట్నం హార్బర్​పై కరోన ప్రభావం పడింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే చేపల రవాణా నిలిచిపోవటంతో మత్య్సకారులు ఆందోళన చెందుతున్నారు.

corona affect on sea foods exports from nizampatnam harbour
కరోనా ప్రభావంతో ఆగిపోయిన చేపల ఎగుమతి

By

Published : Mar 24, 2020, 12:27 PM IST

కరోనా ప్రభావంతో ఆగిపోయిన చేపల ఎగుమతి

గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్​ నుంచి ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతి ఆగిపోయింది. చేపల వేటపై ఆధారపడి మొత్తం 30వేల మంది జీవిస్తున్నారు. చేపల ఎగుమతులపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపడంతో... నిజాంపట్నం హార్బర్ వెలవెలబోతోంది. ఇక్కడి నుంచి రోజు 50 లక్షల విలువైన సముద్ర చేపలు, రొయ్యలు, పీతలు... కేరళ, చెన్నై, ముంబై, కలకత్తా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతాయి. కానీ కరోనా ప్రభావం వల్ల రాష్ట్రాల్లోని ప్రధాన చేపల మార్కెట్లను మూసి వేయడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. ప్రస్తుతం రూ.5 లక్షలు కూడా ఎగుమతి అవ్వడం కష్టంగా మారిందని మత్య్సకారులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి:నరసారావుపేట రహదారులపై బ్లీచింగ్ చల్లిన సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details