ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిలిచిన మిర్చి ఎగుమతులు... భారంగా రైతుల బతుకులు - గుంటూరు మిర్చి వార్తలు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గుంటూరు మిర్చినీ కరోనా దెబ్బ తీసింది. కరోనా వ్యాప్తి కారణంగా చైనా సహా అన్ని దేశాలకూ ఎగుమతులు నిలిచిపోవటంతో ధరలు బాగా తగ్గిపోయాయి. క్వింటా‌కు రూ.2వేల వరకు తగ్గటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. శీతల గోదాములకు అద్దె కట్టడం కూడా రైతులకు అదనపు భారంగా మారింది.

corona affect on guntur mirchi
కరోనా కారణంగా దెబ్బతిన్న మిర్చి ఎగుమతులు

By

Published : Jun 23, 2020, 1:24 PM IST

లాక్‌డౌన్‌ ప్రభావం రాష్ట్రంలోని మిర్చి ఎగుమతులను దారుణంగా దెబ్బతీసింది. ఎగుమతులు బాగా తగ్గడం వల్ల ధరలూ నేలచూపులు చూస్తున్నాయి. గుంటూరు జిల్లాలో పండే తేజ రకం మిర్చికి సాధారణంగా చైనాలో మంచి గిరాకీ ఉంటుంది. అయితే కరోనా వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి అక్కడికి ఎగుమతులు తగ్గిపోయాయి. కొన్నాళ్లకు పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని ఆశించిన రైతులు... ఆ మేరకు శీతల గోదాముల్లో సరకు నిల్వ చేసుకున్నారు. గత 2 నెలలుగా ఇక్కడ నుంచి పంపుతున్న సరకు బాలేదని అక్కడి వ్యాపారులు సమాచారమిస్తుండటంతో... చెల్లింపులూ సక్రమంగా జరగట్లేదని రైతలు వాపోతున్నారు. శీతల గోదాముల్లో పనిచేసే కార్మికులు ఇతర రాష్ట్రాల వారు కావటంతో... లాక్ డౌన్ సందర్భంగా వారు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ప్యాకింగ్‌ విషయంలో ఏదైనా పొరపాటు జరిగిందేమో అని ఇక్కడి వ్యాపారులు సమీక్షించుకుంటున్నారు.

కరోనా కారణంగా దెబ్బతిన్న మిర్చి ఎగుమతులు

అద్దె కూడా కట్టలేని పరిస్థితి

గతంలో మార్కెట్‌కు రోజూ 50 నుంచి 70 వేల మిర్చి బస్తాలు వచ్చేవని... ఇప్పుడు కేవలం 15 నుంచి 25వేలు మాత్రమే వస్తున్నాయని యార్డు వర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు తేజ రకం మిర్చి క్వింటాల్‌ రూ.16వేలు, సూపర్‌ రకం పన్నెండున్నర వేలుగా ఉందని... ఇప్పుడు అవి ప్రస్తుతం 2 వేలకు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు శీతల గోదాములకు అద్దె కట్టడం కూడా రైతులకు అదనపు భారమైంది.

ధరలపైన తీవ్ర ప్రభావం

అనూహ్యంగా భారత్ -చైనా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో ఇప్పట్లో ఎగుమతులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించటం లేదు. అది ధరలపైనా తీవ్ర ప్రభావం చూపనుంది.

ఇదీ చదవండి:మిర్చియార్డులో క్రయవిక్రయాలపై సందిగ్ధం..!

ABOUT THE AUTHOR

...view details