ప్రత్తిపాడులో అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా ప్యాకెట్ల పట్టివేత
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నిషేదిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న రెండు దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు.ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ గోదాములో ఆరు సంచుల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు రూ.25వేల వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు.