ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేసులు పెరుగుతున్నాయ్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' - guntur district corona news

కొవిడ్​ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ కె.ఈశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఒక్కరోజే తెనాలిలో 8 కేసులు నమోదవ్వడం ప్రజల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కాలేజీ విద్యార్థులు కనీసం మాస్కులు కూడా ధరించడం లేదని ఆరోపించారు.

coordinator of the guntur district government hospital dr prasad
'కేసులు పెరుగుతున్నాయ్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

By

Published : Mar 16, 2021, 8:31 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి మాస్క్ ధరించి.. భౌతిక దూరాన్ని పాటించాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ కె. ఈశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలిలో ప్రభుత్వాసుపత్రిని ఆయన పర్యవేక్షించారు. కొవిడ్ సోకిన వారికి చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను ఆయన పరిశీలించారు.

కాలేజీ విద్యార్థులు కనీసం మాస్కులు కూడా ధరించడం లేదని ఆరోపించారు. సోమవారం ఒక్కరోజే తెనాలిలో 8 కేసులు నమోదు కావడం ప్రజల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వారిలో ఇద్దరికి వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొవిడ్ సోకినా.. ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి

ఓ వైపు చదువు.. మరోవైపు కౌన్సిలర్​గా గెలుపు

ABOUT THE AUTHOR

...view details