ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యానర్​ వివాదం.. తెదేపా, వైకాపాల మధ్య ఘర్షణ - గుంటూరు జిల్లా తెదేపా, వైకాపాల మధ్య ఘర్షణ తాజా వార్తలు

గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బ్యానర్ విషయంలో మొదలైన వివాదం.. ఇరువర్గాల వారు నెట్టుకొని, దూషించుకునే వరకు చేరింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకొని సర్ధి చెప్పారు. అనంతరం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

Conflict between Tdp and ysrcp
తెదేపా, వైకాపాల మధ్య ఘర్షణ

By

Published : Mar 19, 2021, 9:06 AM IST


గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో సర్పంచ్ భర్తకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఈనెల 28న సింగరాయ పాలెం తండా సమీపంలోని లక్ష్మీ నృసింహస్వామి కల్యాణాన్ని పురష్కరించుకొని సాంబశివరావు.. భార్యతో కలిసి ఉన్న బ్యానర్​ను ఏర్పాటు చేశారు. వైకాపాకు చెందిన వర్గీయులు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చిత్రం ఉన్న బ్యానర్​ను.. దానిపై ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో వివాదం మొదలై రెండు పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు ఒకచోటకు చేరటంతో ఉద్రిక్తత నెలకొంది. ఒకరినొకరు నెట్టుకొని దూషించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

ఇరువర్గాల వారికి సర్ది చెప్పటంతో వివాదం సద్దుమణిగింది. వివాదానికి కారణమైన బ్యానర్​ను, ఇనుప కడ్డీలను పంచాయతీ అధికారులు తొలగించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్​లో ఇరువర్గాల వారు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

ఇవీ చూడండి...

'పోలీసులు సెక్షన్లు మార్చి.. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details