జూ.ఎన్టీఆర్ అభిమానులు, వైకాపా నేతల మధ్య 'ఫ్లెక్సీ' పంచాయితీ - వైకాపా నేతల మధ్య ఫ్లెక్సీ పంచాయితీ
19:00 May 20
ఎన్టీఆర్ ఫ్లెక్సీ కడితే ఊరుకోబోమన్న వైకాపా నాయకులు
గుంటూరు జిల్లా తెనాలిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, వైకాపా నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు 15వ వార్డులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైకాపా మున్సిపల్ వైస్ ఛైర్మన్ కోటేశ్వరరావు సొంత వార్డు కావటంతో ఫ్లెక్సీ ఏర్పాటుపై వివాదం తలెత్తింది. మూడేళ్లుగా తమ వార్డులో ఎన్టీఆర్ ఫ్లెక్సీ కట్టట్లేదన్న వైకాపా నాయకులు..ఫ్లెక్సీ కడితే ఊరుకోబోమని జూ.ఎన్టీఆర్ అభిమానులను హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే ఫ్లెక్సీలు పెట్టినపుడు తమ అభిమాన నటుడి ఫ్లెక్సీ పెటితే తప్పేంటని ఎన్టీఆర్ అభిమానులు వైకాపా నాయకులను ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఇవీ చూడండి