వేతనాలు చెల్లించాలంటూ ఒప్పంద వ్యాయామ ఉపాధ్యాయులు ఆందోళన బాటపడ్డారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద నిరసనకు దిగారు. గత వ్యాయామ ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో కొందరి అర్హులను గత ప్రభుత్వంఒప్పంద ప్రాతిపదికన నియమించిందని తెలిపారు.
జీతాలు చెల్లించట్లేదని సీఎం జగన్ నివాసం ముందు ఆందోళనలు - pet teachers problems in andhra pradesh
13నెలలుగా తమకు వేతనాలివ్వట్లేదని ఒప్పంద వ్యాయామ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కరోనా విధులకు సైతం వినియోగించుకున్నారని చెబుతున్నారు. జీతాలు లేక పూటగడవటం కష్టంగా మారిందంటున్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద నిరసన చేపట్టారు.

13నెలలుగా జీతాలు లేవంటూ సీఎం నివాసం ముందు ఆందోళన
ప్రభుత్వం మారినప్పటి నుంచి జీతాలు నిలిపేశారని వారంతా వాపోయారు. అప్పటి నుంచి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఆందోళనకారులు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు 13 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పూట గడవక తమ కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళనకారులనుపోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.