ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జీజీహెచ్‌ ఎదుట ఒప్పంద నర్సుల ఆందోళన - nurses problems at gutnur

గుంటూరు జీజీహెచ్‌ ఎదుట ఒప్పంద నర్సులు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. నిరనస చేపట్టారు. కొవిడ్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. తక్షణమే ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని ఒప్పంద నర్సుల డిమాండ్‌ చేశారు.

contract nurses
contract nurses

By

Published : Jun 16, 2021, 1:35 PM IST

గుంటూరు జీజీహెచ్​ ఎదుట ఒప్పంద స్టాఫ్‌నర్సులు ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 3వ రోజు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం కొవిడ్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి.. కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్‌నర్సుల పట్ల సానుకూలంగా స్పందించి రెగ్యులర్ చేయాలని కోరారు.

కొవిడ్ రోగులకు సేవలు అందిస్తూ అసువులు బాసిన స్టాఫ్‌నర్సుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలన్నారు. ఒప్పంద స్టాఫ్‌నర్సుల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజులలో నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

పంచాయతీలుండగా..గ్రామ సచివాలయాలు ఎందుకు?

ABOUT THE AUTHOR

...view details