గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు పాలకవర్గాన్ని మరో ఏడాదిపాటు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జనవరి 24వ తేదీకి ఏసురత్నం ఛైర్మన్గా 17మంది సభ్యులతో పాలకవర్గం విధుల గడువు ముగిసింది. అయితే కొత్త పాలకవర్గాల కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోపే.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
గుంటూరు మార్కెట్ యార్డు పాలకవర్గం గడువు మరో ఏడాది పొడగింపు.. - గుంటూరు మార్కెట్ యార్డు పాలకవర్గం
గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు పాలకవర్గాన్ని మరో ఏడాదిపాటు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని కొన్ని పట్టణాల యార్డుల ఛైర్మన్లను అలానే ఉంచనున్నట్లు పేర్కొంది.

మరోఏడాది దాకా గుంటూరు మార్కెట్ యార్డు పాలకవర్గం కొనసాగింపు
దీంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఆ తరువాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కోడ్ ఎత్తివేయటంతో పాలకవర్గాలకు మరో ఏడాది అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు మార్కెట్ కమిటీతో పాటు తెనాలి, పొన్నూరు, బాపట్ల, వినుకొండ, మాచర్ల, ఈపూరు మార్కెట్ యార్డులకు కూడా పాత పాలకవర్గాన్నే కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి:కార్యాలయం లేని హక్కుల కమిషన్... ఇంట్లోనే బాధ్యతల స్వీకరణ