రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ మంగళగిరి పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) ప్రకారం నిందితులకు పోలీసులు నోటీసులు ఇవ్వకపోవడాన్ని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని కోర్టు ధిక్కరణగా పరిగణించొచ్చని హెచ్చరించింది.
తదుపరి చర్యలు నిలుపుదల..
ఈ అంశంపై వివరంగా తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ జె.సాంబశివరావుపై మంగళగిరి పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ కోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
41ఏ నోటీసు ఇవ్వలేదు..
మంగళగిరి పట్టణ పోలీసులు ఈనెల 21న తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ ఉండవల్లికి చెందిన జె.సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో రెండో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 41ఏ నోటీసు ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాది సాయి కుమార్ వాదనలు వినిపించారు.
గరిష్టంగా 5 ఏళ్లలోపు..