ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామన్నారు... చివరికి రోడ్డున పడేశారు' - guntur construction workers agitation

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరులో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. గుంటూరు భవన నిర్మాణ కార్మిక శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

construction workers agitation
భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

By

Published : Feb 12, 2021, 1:59 PM IST

గుంటూరులో భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని.. భవన నిర్మాణ కార్మిక శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నిరసన తెలిపారు. అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కరిస్తామన్న జగన్... సీఎం అయ్యాక రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికుల సంక్షేమ బోర్డ్ నుంచి దారి మళ్లించిన 450 కోట్ల రూపాయలను తక్షణమే బోర్డుకు జమ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన.. కార్మికులకు 10 వేల రూపాయల జీవన భృతి కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details