కరోనా లాక్ డౌన్ తెచ్చిపెట్టిన కష్టంతో కొందరు తమ వృత్తులు, ఉపాధి మార్గాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరులోని నల్లెచెర్వుకు చెందిన తాపీమేస్త్రి మాల్యాద్రికీ అదే పరిస్థితి ఎదురైంది. భవన నిర్మాణ పనులు లేని కారణంగా.. పొట్ట కూటి కోసం ఊరూరూ తిరిగి పండ్లు అమ్మకుంటున్నాడు.
నెల రోజుల నుంచి ఉదయాన్నే మార్కెట్ కు వెళ్లి పండ్లు కొనుగోలు చేసి నగరంలో తిరుగుతూ విక్రయిస్తున్నారు. అప్పట్లో ఐదారు నెలలు ఇసుక కొరతతో పని లేకుండా పోయిందని... ఆ తర్వాత నిర్మాణాలు మొదలైన కొద్ది నెలలకే కరోనా కారణంగా మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయని ఆవేదన చెందాడు. ప్రస్తుతం మామిడి పండ్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంతో ఎలాగోలా కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు తెలిపాడు.