ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాడుతూ పట్టుబడిన కానిస్టేబుల్, హోంగార్డు - బాపట్లలో కానిస్టేబుల్ పేకాట

జూదరులపై చర్యలు తీసుకోవాల్సిన కానిస్టేబులు​ జూదమాడుతూ పట్టుబడ్డాడు. అతనితో పాటు ఓ హోంగార్డు కూడా చిక్కాడు. వీరిపై క్రిమినల్ కేసులతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.

Constable, homeguard caught when Playing the poker
Constable, homeguard caught when Playing the poker

By

Published : Jun 7, 2020, 2:07 PM IST

గుంటూరు జిల్లా బాపట్లలో సూర్యలంక రోడ్డులోని ఓ బహుళ అంతస్తుల భవనంలో పేకాట స్థావరంపై డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు అశోక్‌ కుమార్‌, శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది శనివారం రాత్రి దాడి చేశారు. జూదం ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ కానిస్టేబుల్‌, హోంగార్డు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బాపట్ల డీఎస్పీ శ్రీనివాస రావు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. జూదరులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కానిస్టేబుల్‌, హోంగార్డులపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేయటంతో పాటు... శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దాడిలో 1.19 లక్షల రూపాయల నగదు, 8 సెల్​ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details