ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి - రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

గుంటూరు జిల్లా బాపట్ల నుంచి పెదనందిపాడు వెళ్లే రహదారిలో.. ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో.. కాకుమాను పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్న దామర్ల రామ్మోహన్ మృతిచెందారు.

accident
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

By

Published : Apr 6, 2021, 12:05 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల నుంచి పెదనందిపాడు వెళ్లే రహదారిలో.. ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కానిస్టేబుల్ దామర్ల రామ్మోహన్ మృతిచెందాడు. బాపట్లలోని రైలుపేటకు చెందిన రామ్మోహన్.. కాకుమాను పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

పోలీస్ స్టేషన్​లో రాత్రి విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై.. కాకుమాను వెళ్తుండగా, జమ్ములపాలెం ఎస్సీ కాలనీ సమీపంలో ప్రమాదవశాత్తూ వాహనంపై నుంచి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న కానిస్టేబుల్​ను గుర్తించిన స్థానికులు.. చికిత్స నిమిత్తం బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం.. వైద్యులు గుంటూరు ఆసుపత్రికి పంపించారు. గుంటూరులో చికిత్స పొందుతు కానిస్టేబుల్ మృతి చెందారు.

ఇదీ చదవండి:ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం... ఇద్దరు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details