ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం కార్యాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్‌ అభ్యర్థులు.. 8 మంది అరెస్ట్​ - YS Jagan

Tadepalli CM Office: కానిస్టేబుల్ రాత పరీక్షలలో కటాఫ్ మార్కులు కలపాలని కోరుతూ అభ్యర్థులు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాలలో బార్కెట్లు పెట్టి పోలీసులు వాహన రాకపోకలను మళ్లించారు. సీఎంకు వినతిపత్రం అందించేందుకు వచ్చిన వారిలో 8మంది అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tadepalli CM Office
Tadepalli CM Office

By

Published : Feb 11, 2023, 2:12 PM IST

సీఎం కార్యాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్‌ అభ్యర్థులు.. 8 మంది అరెస్ట్

Tadepalli CM Office: పోలీస్ రాత పరీక్షలలో ఐదు మార్కులు కలపాలని కోరుతూ అభ్యర్థులు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాలలో బార్కెట్లు పెట్టి వాహన రాకపోకలను మళ్లించారు. ఐదు మార్కులు కలిపితే దాదాపు 30 శాతం మంది ఫిట్నెస్ పరీక్షకు అర్హత సాధిస్తారని అభ్యర్థులు చెప్పారు. నోటిఫికేషన్ విడుదల చేసిన 50 రోజులకే పరీక్ష పెట్టడం వల్ల చాలామంది అర్హత సాధించలేకపోయారని వాపోయారు. తమ బాధలను సీఎం కి చెప్పి వినతిపత్రం అందించేందుకు వచ్చిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలో కటాఫ్‌ మార్కులు తగ్గించాలనే డిమాండ్‌తో గత కొన్ని రోజులుగా అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థులకు ఐదు మార్కులు కలిపితే క్వాలిఫై అవుతామని వారు పేర్కొంటున్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు అభ్యర్థులు ఇవాళ తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది జనవరి 22న కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌ను నిర్వహించారు. దాదాపు 4,58,219 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈనెల 5న ఫలితాలు విడుదల చేశారు. ఫలితాల్లో 99వేల మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

భారీ బందోబస్తు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాస ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కానిస్టేబుల్‌ అభ్యర్థులు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి వెయ్యి మందికిపైగా కానిస్టేబుల్ అభ్యర్థులు వస్తున్నట్లు సమాచారం రావడంతో సీఎం నివాస ప్రాంతం, పాత టోల్‌గేట్‌, సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే మార్గాల్లో భారీగా పోలీసులు మోహరించారు. తాడేపల్లి వస్తున్న అభ్యర్థులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details