గుంటూరుకు చెందిన కనెక్ట్ టూ ఆంధ్ర ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాకు నిత్యావస వస్తువులతో కూడిన కిట్లను పంపించనున్నారు. హెచ్‌సీఎల్, కోకాకోలా సంస్థల సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు మాస్కులు, శానిటైజర్లు సైతం అందిస్తామని సంబంధిత సంస్థ సీఈవో కోటేశ్వరమ్మ తెలిపారు.
కర్నూలు జిల్లాకు 'కనెక్ట్ టూ ఆంధ్ర' చేయూత - గుంటూరు జిల్లాలో లాక్డౌన్ ప్రభావం
రాష్ట్రంలోనే కరోనా పాజిటివ్ కేసులు కర్నూలు జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తితో అతలాకుతలమవుతున్న జిల్లాను ఆదుకోవడానికి గుంటూరుకు చెందిన కనెక్ట్ టూ ఆంధ్ర అనే సంస్థ ముందుకొచ్చింది. కర్నూలుకు నిత్యావసర సరకుల కిట్‌ను పంపిణీ చేసి సేవాగుణాన్ని చాటుకోనుంది.

పంపిణీకి సిద్ధంగా ఉన్న నిత్యావసర వస్తువులు