కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా తెనాలి కేంద్రంగా జిల్లాను ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు తెనాలి ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తెనాలికి 110 సంవత్సరాల చరిత్ర ఉండటంతో పాటు 2లక్షలకు పైగా జనాభా ఉన్నారని... రైల్వేస్టేషన్, జిల్లాస్థాయి ఆసుపత్రితో పాటు అవసరమైన హంగులన్నీ ఉన్నాయని కాంగ్రెస్ నేత చందు సాంబశివుడు అన్నారు. ఈ మేరకు తెనాలి సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కాంగ్రెస్ శ్రేణుల నిరసన - tenali latest updates
తెనాలి కేంద్రంగా జిల్లాను ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెనాలి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ మేరకు తెనాలి సబ్‌కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కాంగ్రెస్ శ్రేణుల నిరసన