Congress: ఇప్పటం గ్రామంలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసిన విధ్వంసంపై రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆక్రమణల తొలగింపులో అనైతికంగా అత్యుత్సాహంగా ప్రవర్తించిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత మస్తాన్ వలీ స్పష్టంచేశారు. సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొనే ప్రభుత్వం ఈ విధ్వంసానికి పాల్పడిందన్నారు. ఈ ఘటన పై కాంగ్రెస్ పార్టీ తరపున ఏర్పాటు అయిన నిజ నిర్ధారణ కమిటీ ఇప్పటం గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడింది. కార్పొరేషన్ అధికారులు సిబ్బంది తమ సామానులు తీసుకునే వెసులు బాటు కూడా కల్పించలేదని బాధితులు తెలిపారు. వారితో మాట్లాడిన అనంతరం కాంగ్రెస్ నేతలు ఇప్పటం గ్రామంలో కొద్దిసేపు నినాదాలు చేశారు. బాధితులకు పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు.
అధికారుల విధ్వంసంపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం..: కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ - ఏపీ కాంగ్రెస్ వార్తలు
Congress: ఇప్పటం గ్రామంలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసిన విధ్వంసంపై రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆక్రమణల తొలగింపులో అనైతికంగా అత్యుత్సాహంగా ప్రవర్తించిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత మస్తాన్ వలీ స్పష్టం చేశారు.
congress leader Masthan Vali