ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో విస్తృతం చేస్తాం' - మస్తాన్ వలీ తాజా వార్తలు

రాజధాని అమరావతిని నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉరుకోదని..,ఈ సమస్యపై మరింత ఉద్యమిస్తామని ఆపార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలీ స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో విస్తృతం చేస్తామని వ్యాఖ్యనించారు.

అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో విస్తృతం చేస్తాం
అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో విస్తృతం చేస్తాం

By

Published : Dec 5, 2020, 6:43 PM IST

రాజధాని అమరావతి ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున జాతీయ స్థాయిలో విస్తృతం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలీ స్పష్టం చేశారు. మూడు రాజధానులపై ఎన్నికలకు ముందు ఏనాడు చెప్పని జగన్...ఇప్పుడు మూడు రాజధానులంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతిని నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉరుకోదని..,ఈ సమస్యపై మరింత ఉద్యమిస్తామని చెప్పారు.

రాజధాని అమరావతిపై చేపట్టాల్సిన కార్యచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి జగన్​కు వినిపించేందుకు బయల్దేరితే...గృహ నిర్భంధం చేసి అనంతరం పోలీసు స్టేషన్​కు తరలించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి మరీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details