'కాంగ్రెస్ను అణిచివేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర' - కాంగ్రెస్ను అణగదొక్కడానికి మోదీ ప్రభుత్వం కుట్ర
ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ప్రియాంక గాంధీ భద్రతను ఉద్దేశపూర్వకంగానే తగ్గించారని కాంగ్రెస్ పార్టీ నేత మస్తాన్ వలీ విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని అణిచివేయటానికి మోదీ ప్రభుత్వం పథకం రచిస్తోందని ఆయన ఆరోపించారు.
'కాంగ్రెస్ను అణిచివేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర'
దేశంలో కాంగ్రెస్ పార్టీని అణిచివేయటానికి మోదీ ప్రభుత్వం పథకం రచిస్తోందని ఆ పార్టీ నేత మస్తాన్ వలీ విమర్శించారు. కుట్రలో భాగంగానే ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ప్రియాంక గాంధీకి భద్రతను తగ్గించారని ఆరోపించారు. ప్రియాంక గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని, తక్షణమే ఆమెకు భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాయకుల కోసం తాము ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు.