వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. ఈ బిల్లు వల్ల కార్పొరేట్ శక్తులకు లాభమని మస్తాన్ వలి ఆరోపించారు. భాజపా ప్రభుత్వ నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తూ 26వ తేదీన 'స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 28న ఐదు వందల మందితో కలిసి గవర్నర్కు వినతి పత్రం అందజేస్తామని మస్తాన్ వలి తెలిపారు.
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ 'స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్' - వ్యవసాయ బిల్లుపై కాంగ్రెస్ నిరసనలు
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రేపు 'స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్' కార్యక్రమం చేపట్టనున్నట్లు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. ఈ నెల 28న ఐదు వందల మందితో కలిసి గవర్నర్కు వినతి పత్రం అందజేయనున్నట్ల వెల్లడించారు.

మస్తాన్ వలి
అక్టోబర్ 2న విశాఖపట్నంలో కిసాన్ మజ్దూర్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా అక్టోబర్ 2 నుంచి 31 తేదీ వరకు సంతకాల సేకరణ చేపడతామని తెలిపారు.
ఇదీ చదవండి: 'బిల్లు'పై దేశవ్యాప్తంగా ఆందోళనలు- పోలీసులు అప్రమత్తం