ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారంలో వైకాపా ప్రభుత్వం.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఏపీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి అన్నారు. ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు చేశారు. వైకాపా ఏడాది పాలనలో అరాచకాలు, అవినీతి మినహా.. అభివృద్ధి శూన్యమని ఆరోపించారు.
'సీఎం జగన్ను సలహాదారులే పక్కదారి పట్టిస్తున్నారు' - వైకాపాపై కాంగ్రెస్ విమర్శలు
స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ..హైకోర్టు తీర్పును తప్పు పట్టడం ఎక్కడా చుడలేదని ఏపీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి అన్నారు. వైకాపా ఏడాది పాలనలో అరాచకాలు, అవినీతి మినహా.. అభివృద్ధి శూన్యమని ఆరోపించారు.
congress
హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ..హైకోర్టు తీర్పును తప్పు పట్టడం ఎక్కడా చుడలేదన్నారు. సీఎం జగన్ను ఆయన సలహాదారులే పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఇకనైనా ప్రజలు మెచ్చే పాలన చేయాలని.. లేదంటే ప్రజాగ్రహంలో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని మస్తాన్ వలి హెచ్చరించారు.