ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతికే మా మద్దతు'... హైకోర్టులో కాంగ్రెస్ ప్రమాణపత్రం - హైకోర్టులో ఏపీ కాంగ్రెస్ పిటిషన్ వార్తలు

మూడు రాజధానులను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. తాము అమరావతికి అనుకూలం అంటూ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది.

ap high court
ap high court

By

Published : Sep 21, 2020, 10:47 PM IST

Updated : Sep 22, 2020, 3:16 PM IST

ఆంధ్రప్రదేశ్​కు అమరావతే ఏకైక రాజధాని అన్న అంశానికి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టులో సోమవారం ప్రమాణపత్రం దాఖలు చేశారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనులకు వేల కోట్ల రూపాయలు వెచ్చించినందున... రాజధాని మారిస్తే ఆ డబ్బంతా వృథా చేయటమేనని శైలజానాథ్ పేర్కొన్నారు.

మూడు రాజధానులపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాలని ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రాజధాని మార్పును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని హైకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో వెల్లడించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, పాల్ ప్రమాణపత్రాలను కోర్టుకు సమర్పించారు.

Last Updated : Sep 22, 2020, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details