ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Congratulations to ISRO Team on Aditya L1 Mission Success: ఇస్రోకి అభినందనల వెల్లువ.. ఆదిత్య ఎల్​1 ప్రయోగం విజయవంతం - ఆదిత్య ఎల్​1 ప్రయోగం

Congratulations to ISRO Team on Aditya L1 Mission Success: సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్​1 ప్రయోగం విజయవంతం కావడంతో యావత్ భారత్​ సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఈ మిషన్ విజయవంతంపై సంబరాలు చేసుకున్నారు. అటు ఆదిత్య ఎల్​1 విజయంపై ప్రముఖులు శాస్తవేత్తలను అభినందించారు.

Congratulations to ISRO Team on Aditya L1 Mission Success
Congratulations to ISRO Team on Aditya L1 Mission Success

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 7:06 PM IST

Congratulations to ISRO Team on Aditya L1 Mission Success: సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్​1 (Aditya-L1) ప్రయోగం విజయవంతం కావడంతో అభినందనలు వెల్లువెత్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రయోగానికి ముందు విశాఖలో విద్యార్థులు చేసిన పని పలువురిని ఆకట్టుకుంది.

విశాఖలో సంపత్ వినాయక ఆలయం వద్ద ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతం కావాలని విద్యార్థులు ప్రత్యేక పూజలు చేశారు. జాతీయ జెండా చేతపట్టుకుని ఆల్ ది బెస్ట్ ఇస్రో అంటూ తెలిపారు. అనంతరం ఆలయం వద్ద విద్యార్థులు 108 కొబ్బరి కాయలు కొట్టారు. ఆదిత్య L1 సక్సెస్ కావాలని విద్యార్థులు దేవుడ్ని కోరుకున్నారు. ఇక ప్రయోగం విజయవంతం కావడంతో పలువురు ప్రముఖులు ఇస్రో శాస్తవేత్తలను అభినందిస్తున్నారు.

Aditya L1 Launch : నింగిలోకి 'ఆదిత్య ఎల్​ 1'.. ప్రయోగం సక్సెస్.. వీడియో చూశారా?

CM Jagan congratulates ISRO team: సౌర అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. భారత్ తొలి సౌర ఉపగ్రహ అబ్జర్వేటరీ మిషన్ విజయవంతమై భారత అంతరిక్ష పరిశోధన, సాంకేతికత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం జగన్ పేర్కోన్నారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలను ముఖ్యమంత్రి జగన్ అభినందిస్తున్నట్టు సీఎంఓ ప్రకటన జారీ చేసింది.

Chandrababu Congratulations to ISRO:శ్రీహరికోట నుంచి ఆదిత్య-ఎల్1ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. సూర్యుడిపై పరిశోధనలకు తొలి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీగా ఒక చారిత్రాత్మక మైలురాయిని భారత్ సొంతం చేసుకుందని తెలిపారు. భారతదేశ నైపుణ్యానికి ఇదే నిదర్శనం అని కొనియాడారు.

Aditya L1 Launch : నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్​1'.. సూర్యుడిని నిమిషానికోసారి క్లిక్‌!

Daggubati Purandeswari on Aditya L1 Mission: ఆదిత్య ఎల్‌1 సోలార్ మిషన్​ను ప్రారంభించడం ద్వారా భారతదేశ అంతరిక్ష పరిశోధన మరో అద్భుతమైన మైలురాయిని సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశంసించారు. చంద్రయాన్ 3 విజయవంతం తరువాత.. ఇస్రో దృష్టి సూర్యుని రహస్యాలను డీకోడింగ్ వైపు మళ్లించిందన్నారు. 'అమృత్ కాల్ క్షణం'గా పేర్కొనబడే ఈ మహత్తర సందర్భం నిజంగా దేశానికి స్ఫూర్తిదాయకమని పురందేశ్వరి తెలిపారు.

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలు ఆకాశమే హద్దుగా కొత్త శిఖరాలకు చేరుకున్నాయన్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లోని అంకితభావం కలిగిన శాస్త్రవేత్తలు నిలకడగా అత్యుత్తమ ఫలితాలను అందించారన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో భారతదేశాన్ని ప్రముఖ ప్రపంచ ఆటగాడిగా నిలిపారన్నారు. ఆదిత్య L1 విజయవంతం భారతదేశ స్థానాన్ని మరింత పటిష్టం చేసిందని పురందేశ్వరి అన్నారు.

Aditya L1 Mission Successful : 'మానవాళి సంక్షేమం కోసమే ఆదిత్య-ఎల్​1'.. లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న వ్యోమనౌక

Nara Lokesh Congratulates ISRO Scientists: ఆదిత్య-ఎల్1 ప్రయోగం విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్​ అభినందనలు తెలిపారు. సూర్యుడిపై పరిశోధనలకు తొలి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీగా ఒక చారిత్రాత్మక మైలురాయిని భారత్ సొంతం చేసుకుందని కొనియాడారు. అంతరిక్ష సాంకేతికత, పరిశోధనలలో భారతదేశం ఎదుగుతున్న నైపుణ్యానికి ఈ ఘనత నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ప్రయోగం దేశ ఐక్యతను చాటుతూ యువతకు ప్రేరణగా నిలుస్తోందని వెల్లడించారు.

Aditya L1 Mission : 'అంతరిక్ష రంగంలో భారత్‌ పాత్ర పెరుగుతోంది'.. 'ఆదిత్య' విజయం కోసం హోమాలు, పూజలు

ABOUT THE AUTHOR

...view details