లాక్డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయల నగదును గుంటూరు జిల్లాలో నేడు పంపిణీ చేశారు. అయితే కొన్నిచోట్ల సర్వర్లు మొరాయించడం వల్ల వార్డ్ వాలంటీర్లు నగదు ఇవ్వకుండానే వెనుదిరిగారు. ఇంకొన్నిచోట్ల అర్హులైనా తమ పేర్లు లిస్ట్‌లో లేవని ఆరోపించారు. ఏ అర్హత లేనివారికి రేషన్ కార్డులు ఉన్నాయని కొంతమందికి నగదు ఇచ్చారని, తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ తమకు నగదు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
మేమెందుకు అర్హులం కాదు..! - corona cases in guntur dist latest news update
గుంటూరు జిల్లాలో నేడు తెల్ల రేషన్ కార్డు దారులకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే కొన్ని చోట్లు సర్వర్లు మోరాయించడం నగదు ఇవ్వకుండానే వాలంటీర్లు వెనుదిరిగారు. ఇంకొన్ని చోట్లు అర్హులైన తమ పేర్లు జాబితాలో లేవని ఆరోపించారు.

గుంటూరు జిల్లాలో నగదు పంపిణీ