DUGGIRALA MPP ELECTION: కోరం లేక వాయిదా పడిన దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక - ap latest news
13:44 September 25
ఎంపీపీ ఎన్నికకు దూరంగా ఉన్న తెదేపా, జనసేన సభ్యులు
గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎంపీపీ ఎన్నికకు కోరం లేదని ఎస్ఈసీకి ఆర్‌వో నివేదించారు. ఎంపీపీ ఎన్నిక తేదీని ఎస్ఈసీ తర్వాత ప్రకటించనుంది. 18 మంది ఎంపీటీసీలకుగాను వైకాపాకు చెందిన 8 మంది సభ్యులు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే సమావేశానికి హాజరయ్యారు.
తెదేపాకు చెందిన 9 మంది సభ్యులు, జనసేనకు చెందిన ఒక సభ్యుడు ఎంపీపీ ఎన్నికకు దూరంగా ఉన్నారు. 50 శాతం మంది సభ్యులు ఉంటేనే ఎంపీపీ ఎన్నిక సాధ్యపడుతుంది. కోరం లేనందున మెుదటగా మ. 3 గంటలకు ఎన్నికల అధికారి ఎన్నికను వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి ఉండటంతో కోరం లేదని ఆర్‌వో రామ్‌ప్రసన్న ఎస్ఈసీకి తెలిపారు. ఎస్‌ఈసీ నిర్ణయం మేరకు ఎంపీపీ ఎన్నిక తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు ఆర్‌వో.
ఇదీ చూడండి:LIVE UPDATES: జడ్పీ ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ