ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగలకుదురులోని పోలింగ్​ కేంద్రం వద్ద గందరగోళం - confusion at the polling station news

గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులోని పోలింగ్​ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. కొందరు వ్యక్తులు పోలింగ్ బూత్​ వద్దకు వచ్చి ఆందోళన సృష్టించారు.

confusion at the polling station
పోలింగ్​ కేంద్రం వద్ద గందరగోళం

By

Published : Feb 9, 2021, 12:46 PM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులోని పోలింగ్​ కేంద్రం వద్ద కొందరు హడావుడి చేశారు. గుంపులుగా వచ్చి పోలింగ్​ బూత్​లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న అధికారులు, పోలీసులపైన పెద్దగా కేకలు వేస్తూ గందరగోళం చేశారు. పోలీసులు వారిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ నేతలనే అడ్డుకుంటారా అంటూ వాగ్వాదానికి దిగారని ఎస్సై తెలిపారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగిందని చెప్పారు. తమను విధులు నిర్వర్తించకుండా వైకాపా నేతలు అడ్డుకుంటున్నారని పోలీసులు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details