CONFLICTS BETWEEN YCP LEADERS : వైసీపీలో రోజురోజుకూ వర్గపోరులు బహిర్గతమవుతున్నాయి. ఒక వర్గానికి చెందిన నాయకులు.. తమను పట్టించుకోవడం లేదని మరో వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరులో నిర్వహించిన వైసీపీ సమావేశంలో ఇరు వర్గాల విభేదాలు కాస్తా.. కాలర్ పట్టుకునే పరిస్థితికి వచ్చాయి.
రసాభాసగా వైసీపీ విసృత్తస్థాయి సమావేశం.. కాలర్ పట్టుకున్న ఇరు వర్గాల వైసీపీ నేతలు
CONFLICTS BETWEEN YCP LEADERS IN GUNTUR : గుంటూరులో జరిగిన వైసీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం రసాభాసగా మారింది. కాకుమాను మండల నాయకుల మధ్య విభేదాలు సమావేశం సందర్భంగా బయటపడ్డాయి. సమావేశంలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న నాయకులు.. ఆ తర్వాత వాగ్వాదానికి దిగారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కాకుమాను మండలంలోని పలువురు నాయకులు మధ్య విభేదాలు సమావేశం అనంతరం బయటపడ్డాయి. మండలానికి చెందిన నాయకులు ఒకరిపై ఒకరు సమావేశంలో ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత వాగ్వాదానికి దిగారు. పరిస్థితి కాలర్ పట్టుకునే అంతవరకు వెళ్లింది. స్థానికంగా ఉన్న పోలీసులు వివాదాన్ని సర్దుబాటు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వల్లూరు, రేటూరు గ్రామాలకు చెందిన నాయకులు.. మండల కన్వీనర్‌ను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమావేశంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే సుచరిత , నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: