ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలుకలూరిపేట వైకాపాలో భగ్గుమన్న విభేదాలు

చిలకలూరిపేట నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు తారా స్థాయికి చేరుతోంది. మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే విడదల రజిని మద్దతుదారుల మధ్య వివాదం ముదురుతోంది. వీరు బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. మర్రి రాజశేఖర్ మద్దతుదారుడైన బైరా కృష్ణకు చెందిన బార్​ అండ్ రెస్టారెంట్​ ఎదుట ఉన్న రేకుల షెడ్లను అధికారులు దగ్గరుండి తొలగించారు. ఇది కక్ష సాధింపులో భాగమేనని కృష్ణ ఆరోపించారు.

conflicts between the ycp leaders In Chilakaluripeta
conflicts between the ycp leaders In Chilakaluripeta

By

Published : Mar 6, 2020, 5:58 AM IST

Updated : Mar 6, 2020, 4:02 PM IST

ఈటీవీ భారత్​తో బైరా కృష్ణ

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైకాపా నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధికార పార్టీ నాయకుడు బైరా కృష్ణకు చిలకలూరిపేటలోని అడ్డరోడ్డు కూడలి వద్ద ఓ బార్​ అండ్ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ పక్కనే ఉన్న రేకుల షెడ్లను ఆక్రమణల పేరిట మున్సిపల్​ అధికారులు తొలగించారు. తొలుత ఈ ప్రక్రియను ఆపాలని బైరా కృష్ణ కోరగా.... దానికి పురపాలక కమిషనర్ ఒప్పుకోలేదు. ఆక్రమణలు తొలగిస్తేనే ఇక్కడ నుంచి కదులుతానని నేలపై కూర్చున్నారు.

ఇటీవల ప్రభల యాత్ర సందర్భంగా జరిగిన సంఘటనల నేపథ్యంలో ఎమ్మెల్యే విడదల రజిని కక్ష గట్టి తమ బార్ అండ్ రెస్టారెంట్ పక్కన ఉన్న రేకుల షెడ్లను ఆక్రమణ పేరుతో పురపాలక కమిషనర్ ద్వారా తొలగించారని బైరా కృష్ణ ఆరోపించారు. తాము మాజీ ఎమ్మెల్యే, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్​, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు అనుకూలంగా ఉన్నందునే.... దురుద్దేశంతో కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ పరిణామాలపై తమ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తామని వైకాపా నాయకుడు బైరా కృష్ణ తెలిపారు. మరోవైపు ఈ విషయంపై పురపాలక కమిషనర్​ను వివరణ కోరగా తాను మాట్లాడనని పక్కకు వెళ్లిపోయారు.

Last Updated : Mar 6, 2020, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details