ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగురాళ్లలోని స్థల వివాదంలో ఘర్షణ.. కేసు నమోదు - guntur district newsupdates

పిడుగురాళ్ల తహసీల్దార్ కార్యాలయంలో స్థానికుడికి, మండల సర్వేయర్ కు ఘర్షణ జరిగింది. ఓ స్థల వివాదానికి సంబంధించి మాటా మాటా పెరిగి సంతోష రావు అనే వ్యక్తి దూషించారంటూ.. మండల సర్వేయర్ చేయి చేసుకున్నారు. ఘటనపై.. కేసు నమోదైంది.

Conflict in space dispute in Thunderbolts
పిడుగురాళ్లలో స్థల వివాదంలో ఘర్షణ

By

Published : Feb 5, 2021, 12:23 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల కార్యాలయంలో ఓ వ్యక్తికి, మండల సర్వేయర్ కు మధ్య తలెత్తిన ఘర్షణ.. పోలీసు కేసు నమోదయ్యే వరకూ వెళ్లింది. పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన చల్లగుండ్ల సంతోషరావు... తన ఇంటి సమీపంలో కొన్నేళ్లుగా దారి వివాదం ఉందని.. ఈ సమస్యపై సర్వే చేయాలని కొన్ని రోజులుగా మండల సర్వేయర్ రఘుపతి చుట్టూ తిరుగుతున్నారు.

ఆ దారిని సర్వే చేసిన సర్వేయర్.. కార్యాలయానికి వెళ్లారు. కొద్ది సేపటికి సంతోషరావు అక్కడికి చేరుకున్నారు. వివరాలపై ఆరా తీసే ప్రయత్నం చేయగా.. తన దగ్గర రికార్డులు లేవని సర్వేయర్ చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో సంతోష్ రావు తనను దూషించారంటూ సర్వేయర్ దాడి చేశారు. ఘటనపై.. ఇద్దరూ తమకు ఫిర్యాదు చేశారని సీఐ ప్రభాకరం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details