గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో భూ కౌలు వివాదంలో ఇరు కుటుంబాలు కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. పిట్టు సీతా రామిరెడ్డిపాలేనికి చెందిన అక్కల శివరామకృష్ణ రెడ్డి పొలాన్ని.. పిట్టు శ్రీనివాస రెడ్డి కౌలు తీసుకున్నాడు. నగదు విషయంలో ఇద్దరి మధ్యలో ఘర్షణ ఏర్పడింది.
భూ కౌలు వివాదంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ
భూ కౌలు వివాదంలో ఇరు కుటుంబాలు కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ వివాదంలో ఇరు కుటుంబాల వ్యక్తులకూ గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో జరిగింది.
ఈ వివాదంలో శ్రీనివాసరెడ్డిపై.. శివరామకృష్ణ రెడ్డి కత్తితో దాడి చేశాడు. వివాదం జరిగే సమయంలో శివరామకృష్ణ రెడ్డి తమ్ముడు ఏఆర్ కానిస్టేబుల్ అక్కల మధు స్వామి రెడ్డి అక్కడికి రావటంతో అతనిపై దాడి చేశారు. తలకు తీవ్ర గాయం అయ్యింది. ఈ ఘటనలో పక్కనే ప్రభుత్వ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి.
సమాచారం అందుకున్న చెరుకుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువురి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.