గుంటూరు ఈస్ట్ పారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. పాత, కొత్త పాస్టర్ల మధ్య... ప్రార్థనల నిర్వహణ విషయమై విబేధాలు తలెత్తాయి. బిషప్ ఏలియా, పరదేశి బాబు వర్గాల మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది.
గతంలో నార్త్, వెస్ట్ పారిస్ చర్చిల్లోనూ రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. తాజాగా ఈస్ట్ పారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. పోలీసులు ఈ విషయంలో కలగజేసుకుని.. పరిస్థితిని చక్కదిద్దారు.