ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాకు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు - గుంటూరు జిల్లా నేర వార్తలు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపంలోని చింతలతోపులో వైకాపాకు చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీరు సీసాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

వైకాపాకు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ
వైకాపాకు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ

By

Published : Sep 18, 2021, 8:18 PM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపంలోని చింతలతోపులో.. వైకాపాకు చెందిన రెండు వర్గాల యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీరు సీసాలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణ ముదిరి.. గ్రామస్థులూ కత్తులు, కర్రలతో రంగంలోకి దిగటంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దాడుల్లో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు గ్రామంలో పరిస్థితిని నియంత్రిస్తున్నారు. ఘర్షణలో ఇద్దరు వాలంటీర్లు మహేష్, నాగరాజు ఉన్నారు. రక్తపు గాయాలతో ఉన్న యువకులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రిస్తున్నారు.

వైకాపాకు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ

ఇదీ చదవండి:
KTR: నాకూ డ్రగ్స్‌కీ ఏం సంబంధం? ఏ పరీక్షకైనా సిద్ధమే.. రాహుల్​ గాంధీ సిద్ధమా!

ABOUT THE AUTHOR

...view details