గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో ఎంపీ నందిగం సురేష్ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్దండరాయునిపాలెం దీక్షా శిబిరం వద్ద ఉన్న మైకు తీసేయాలని పోలీసులు రైతులను కోరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు మైకు తొలగించమని చెప్పడం భావ్యం కాదని రైతుల ఆక్షేపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు వైకాపా ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత..పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం - ఉద్దండరాయునిపాలెంలో రైతుల నిరసన
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామంలో ఎంపీ నందిగం సురేష్ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి పర్యటన నేపథ్యంలో పోలీసులు దీక్షా శిబిరం వద్ద ఉన్న మైకు తీసేయాలని కోరారు. తమను పోలీసులు మైకు తొలగించమని చెప్పడం భావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్త వాతావరణం