ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య ఘర్షణ... కత్తిపీటలతో దాడి - guntur district crime

గుంటూరు జిల్లా వడ్డపల్లి గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో పరస్పరం కత్తిపీటలతో దాడి చేసుకోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఇరువురి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య ఘర్షణ
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య ఘర్షణ

By

Published : Sep 10, 2021, 10:13 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వడ్డవల్లి గ్రామంలో అన్నదమ్ముల మధ్య వివాదం జరిగింది. గ్రామానికి చెందిన చిమట నర్సయ్య, గంపదత్తులు వరసకు సోదరులు. పండుగ సందర్భంగా వీరిరువురూ మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి వివాదం పెరిగింది. ఒకరినొకరు కత్తిపీటలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరస్పర ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details