ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడెల మృతిపై.. సంతాపాల వెల్లువ - yanamala ramkrishnudu

కోడెల హఠాన్మరణంపై సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. తెదేపా శ్రేణులు తీవ్ర ఆవేదనలో మునిగాయి.

kodela

By

Published : Sep 16, 2019, 1:39 PM IST

Updated : Sep 16, 2019, 5:04 PM IST

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మృతిపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. కోడెల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సంతాపం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన చెందారు. హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. రాజకీయ ఒత్తిడిపై మరింతగా పోరాటం చేసి ఉంటే బాగుండేదని పవన్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు.. తెదేపా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, యరపతినేని శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. మంచి స్నేహితుడిని కోల్పోయామని తెదేపా నేతలు ఆవేదన చెందారు.

Last Updated : Sep 16, 2019, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details