అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ గుంటూరులో తెదేపా నేతలు కొవ్వుత్తులు వెలిగించి నిరసన తెలిపారు. గుంటూరు చుట్టగుంట కన్నెకంటి హనుమంతరావు విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసును సీబీఐ అప్పగించాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబం బంధువులను మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఫరూక్ సుబ్లీ పరామర్శించారు. సలాం అత్త మాబున్నిశాను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నాడు. ఘటనకు కారణమైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు నెలల్లో న్యాయం జరక్కపోతే ప్రభుత్వం ఇచ్చిన 25 లక్షల చెక్కును వెనక్కి ఇస్తామని మాబున్నిశా తెలిపారు.
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మ శాంతి కోసంప్రత్యేక ప్రార్థనలు..
అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి చేకూరాలని.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు ప్రత్యక ప్రార్థనలు (దువ) చేశారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ మహమ్మద్ నసీర్ అహ్మద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
మైనార్టీలపై దాడులు నిరోధించటంలో ప్రభుత్వం విఫలం...