ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళన 451వ రోజుకు చేరుకుంది. మందడం, వెలగపూడి, తుళ్లూరు, ఉద్ధండరాయునిపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, పెదపరిమి గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా... అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కార్మికులు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని రైతులు, మహిళలు తెలిపారు. అమరావతి, విశాఖ ఉక్కు పరిశ్రమను రాష్ట్ర అభివృద్ధికి రెండు కళ్లు లాంటియని చెప్పారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఒదులుకోబోమని స్పష్టం చేశారు.
విశాఖ ఉక్కు ఉద్యమానికి అమరావతి రైతుల మద్దతు - amravati latest news
అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళన 451వ రోజుకు చేరింది. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కార్మికులు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని రైతులు, మహిళలు తెలిపారు. అమరావతి, విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోను ఒదులుకోబోమని స్పష్టం చేశారు.
విశాఖ ఉక్కు ఉద్యమానికి అమరావతి రైతుల మద్దతు