ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.. డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

TDP leaders Protest at DGP office: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన యువగళం పాదయాత్ర విషయం తెలిసిందే. అయితే పాదయాత్రలో భాగంగా పోలీసుల తీరుపై టీడీపీ నాయకులపై పెట్టిన హత్యాయత్నం కేసులను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్రమ కేసులు బనాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే డీజీపీ, సీఎంకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు.

By

Published : Feb 4, 2023, 5:16 PM IST

Updated : Feb 4, 2023, 9:56 PM IST

DGP
డీజీపీ కార్యాలయం

TDP leaders Protest at DGP office: లోకేశ్‌ యువగళం పాదయాత్రలో పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులపై పెట్టిన హత్యాయత్నం కేసులను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్రమ కేసులు బనాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. డీజీపీ, సీఎంకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. అలాగే పాదయాత్రలో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేయాలని తెలిపారు. అంతేకాకుండా పోలీసు ఆంక్షలపై నివేదించేందుకు గవర్నర్‌ను టీడీపీ నేతలు సమయం కోరారు. అనంతరం మంగళగిరి పోలీసులు టీడీపీ నేతలను రోడ్డుపైనే అడ్డుకున్నారు. శని, ఆదివారాలు డీజీపీ కార్యాలయానికి సెలవు అని తెలిపిన పోలీసులు టీడీపీ నేతల నుంచి రోడ్డు మీదే ఫిర్యాదు తీసుకున్నారు.

యువగళం పాదయాత్ర అడ్డంకులపై పోలీస్ బాస్​కు ఫిర్యాదు చేసేందుకు తెలుగుదేశం నేతలు చేపట్టిన కార్యక్రమం డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతకు కారణమైంది. డౌన్ డౌన్ డీజీపీ, సీఎం అంటూ తెలుగుదేశం నేతల నినాదాలు చేశారు. యువగళంపై హత్యాయత్నం కేసులు నిరసిస్తూ తెలుగుదేశం నేతలు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్రమ కేసులు బనాయించిన వారిపై చర్యలు తీసుకోవటంతో పాటు సీజ్ చేసిన వాహనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

డీజీపీ కార్యాలయానికి టీడీపీ నేతలు వెళ్లకుండా రోడ్డు మీదే తెలుగుదేశం నేతల్ని మంగళగిరి డీఎస్పీ రాంబాబు అడ్డుకున్నారు. రోడ్డు మీదే తనకు ఫిర్యాదు ఇచ్చి వెళ్లాలని డీఎస్పీ కోరారు. డీజీపీకి ఇచ్చే ఫిర్యాదులు రోడ్డు మీద తీసుకోవటమేంటని నేతలు మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ తెలుగుదేశం నేతలు నినాదాలు చేశారు. శని ఆదివారాలు డీజీపీ కార్యాలయానికి సెలవు ఉందన్న పోలీసులు రోడ్డు మీదే ఫిర్యాదు తీసుకున్నారు. వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి దంపతులపై ఉన్నసీబీఐ విచారణ దృష్టి మళ్లించేలా పోలీసుల చర్యలు ఉన్నాయని నేతలు ఆరోపించారు. హత్య కేసు నిందితుల్ని కలిసిన చీఫ్ సెక్రటరీ చీప్​గా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడున్నరేళ్లలో ఒక్కసారే డీజీపీని కలిసినట్లు తమకు గుర్తుందన్నారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకపోవడం కంటే దిగజారుడు తనం ఇంకేం ఉందని ఆక్షేపించారు. అందుబాటులో లేనప్పుడు డీజీపీ కార్యాలయం మాత్రం ఎందుకని ప్రశ్నించారు. సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ కు చెందిన Ap16BQ 2779 వాహనంలో డబ్బులు పంపిణీ జరుగుతోందని ఆరోపించారు. ఒకే నెంబర్​పై 2వాహనాలు నడుపుతున్న కృష్ణమోహన్ రెడ్డి వాహనాన్ని సీజ్ చేయకుండా యువగళం వాహనాల్ని సీజ్ చేయడం దుర్మార్గమని ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా యువగళం ఆగదని స్పష్టం చేశారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ వేగం పుంజుకున్న నాటి నుంచి రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని తెలిపారు. సీబీఐ విచారణతో జగన్మోహన్ రెడ్డి దంపతులు భయాందోళనలో ఉన్నందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని వెల్లడించారు.

డీజీపీ కార్యాలయం దగ్గర టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

ఇవీ చదవండి:

Last Updated : Feb 4, 2023, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details