ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో మున్సిపల్ కార్మికుల ఆందోళన - Concern of municipal workers in Guntur news

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు.

Concern of municipal workers in Guntur
గుంటూరులో మున్సిపల్ కార్మికుల ఆందోళన

By

Published : Oct 6, 2020, 2:12 PM IST

గుంటూరులో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. కరోనాను నివారించడంలో మున్సిపల్ కార్మికుల పాత్ర కీలకమని...వారికి గత 4 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం దారుణమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటా మాల్యాద్రి అన్నారు. పెండింగ్​లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. ఒప్పంద కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తానన్న సీఎం జగన్.. నేడు వారిని ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్​లో చేర్చడం దారుణమన్నారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'రాజధాని' పిటిషన్లపై హైకోర్టులో విచారణ...ఈనెల 9కి వాయిదా

ABOUT THE AUTHOR

...view details