గుంటూరు జిల్లా తెనాలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వలస కూలీలు ఆందోళనకు దిగారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న తమను స్వస్థలాలకు పంపించేయాలని కోరారు. రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం.. ఊరెళ్లిపోతాం..? - thenali news updates
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు ఎలాగైనా సరే.. వారి స్వగ్రామాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో.. తమను స్వస్థలాలకు పంపాలని వలస కార్మికులు ఆందోళన చేపట్టారు.
తెనాలిలో వలస కూలీల ఆందోళన